హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తులతో కిటకిటలాడిన సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం

కృష్ణా: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.