హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులపై కలెక్టర్‌ సమీక్ష

KRNL: జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌, అమరజీవి జలధార, నీరు-పారిశుద్ధ్య మిషన్‌ పథకాల అమలుపై కలెక్టర్‌ డా. ఏ.సిరి RWS అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పథకాల కింద చేపట్టిన పనుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందేలా పనులను వేగవంతం చేయాలన్నారు.