హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు నుంచి బయటకు వచ్చిన క్రిశాంక్

HYD: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సికింద్రాబాద్ కోర్టు నుంచి బయటకు వచ్చారు. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రిశాంక్ కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఆయన అరెస్టును నిరసిస్తూ పలువురు పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు.