హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్డు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో ఉడా కాలనీలో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే.రామ అప్పలనాయుడు, ఇంజినీరింగ్ అధికారులు, కూటమి నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.