SRPT: గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురు డాక్టర్ పవిత్ర వాణికి ఇవ్వాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి బాపూజీ త్యాగాలను గుర్తించి ఆయన కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురికి ఎమ్మెల్సీ ఇవ్వాలి


