హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

GDWL: అలంపూర్ జోగులాంబ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, అదనపు ఎస్పీ శంకర్ పాల్గొన్నారు.