హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదం జరిగాకే మేల్కొంటారా?

RR: షాద్‌నగర్ చౌరస్తాలోని ఫ్లడ్‌లైట్ టవర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి టవర్‌ను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.