హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య శాఖలో 16 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఓబీజీ స్పెషలిస్ట్ 1, అనస్తీషియా 4, రెండో ఏఎన్ఎం 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8 పోస్టులు ఉన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.