హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌత్ జోన్ వాలీబాల్ జట్టుకు యువకుడి ఎంపిక

BHNG: ఆత్మకూర్ మండలం సర్వేపల్లి గ్రామానికి చెందిన సుంకిశాల ఉదయ్ కిరణ్ ప్రతిష్టాత్మక సౌత్ జోన్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యారు. తన ప్రతిభ, అత్యుత్తమ ఆటతీరుతో రాణిస్తున్న ఆయన వరుసగా రెండోసారి సౌత్ జోన్ జట్టుకు ఎంపిక కావడం విశేషం. కఠోర శ్రమ, నిరంతర సాధనతో సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.