ASF: కౌటాల మండలం సదాశివ్ పేట్ గ్రామంలో అరుదైన నక్షత్ర తాబేలు మంగళవారం ప్రత్యక్షమైంది. రాచకొండ సంతోశ్ అనే వ్యక్తి ఇంటి వద్ద ఈ తాబేలు కనిపించడంతో దాన్ని చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని తాబేలును స్వాధీనం చేసుకొని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.
తెలంగాణ
సదాశివ్‌పేట్‌లో అరుదైన నక్షత్ర తాబేలు ప్రత్యక్షం


