ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరం సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. అనంతరం స్థానిక పీఎస్‌లో అప్పగించి, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్


