హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్త్ సెంటర్‌‌ను పరిశీలించిన నోడల్ అధికారి

SKLM: ఆమదాలవలసలోని మెట్టక్కివలస అర్బన్ హెల్త్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ సృజన, డీపీఎంవో డాక్టర్ రవీంద్ర మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలు, అంతర్గత విభాగాలను వారు పరిశీలించారు. ఓపీ, స్క్రీనింగ్, ల్యాబ్, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.