హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: కలెక్టర్

సత్యసాయి: విద్యార్థులు సైద్ధాంతిక విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సూచించారు. కొత్తచెర్వు జూనియర్ కళాశాలలో APSSDC, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 'ల్యాబ్ ఆన్ వీల్స్' వాహనాన్ని ప్రారంభించారు. ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా రోబోటిక్స్, 3D ప్రింటింగ్‌లో ప్రాక్టికల్ శిక్షణ లభిస్తుందన్నారు.