హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత ఉపాధి పరికరాలు పంపిణీ చేసిన MLA

NDL: కొత్తపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఐటీడీఏ-పీటీజీ చెంచు ఆధ్వర్యంలో గిరిజనులకు ఉపాధి పరికరాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం పంపిణీ చేశారు. రూ.5 లక్షల విలువైన 26 కుట్టుమిషన్లు, 10 ఆర్టికల్చర్‌ కట్టర్లు, 3 ఆయిల్‌ ఇంజన్లు, తైవాన్‌ స్ప్రేయర్‌ను లబ్ధిదారులకు అందజేశారు. పరికరాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని MLA సూచించారు.