హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వకష్టహర హనుమాన్‌ అలంకరణలో దర్శనం

MDK: శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల శివారు చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి మంగళవారం సర్వకష్టహర సహకార హనుమాన్‌ అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.