హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

PPM: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు క్లినిక్‌లు ఉపయోగపడతాయన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.