హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్ మార్కెట్‌కు నిధుల మంజూరు

VKB: జిల్లా మార్కెట్ అభివృద్ధికి రూ.2.62 కోట్లు మంజూరైనట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చిత్రపటానికి మంగళవారం మార్కెట్ కార్యాలయ ఆవరణలో పాలాభిషేకం చేశారు. మార్కెట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని శ్రీనివాస ముదిరాజ్ పేర్కొన్నారు.