హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానూరులో యువకుడి ఆత్మహత్య

కృష్ణా: కానూరులో ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుడివాడ మండలం బొమ్మలూరుకు చెందిన కీలారు రామ్‌కుమార్ విజయవాడలో డ్రైవర్‌గా పనిచేస్తూ కానూరులో అద్దె గదిలో ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఆయన మృతి చెందాడు. స్నేహితుడి సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.