హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోటో, షార్ట్ ఫిల్మ్ పోటీల ప్రవేశాలు ఆహ్వానం: ఎస్పీ

SRPT: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈరోజు ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసుల సేవలపై గత ఏడాది కాలంలో తీసిన 3 ఫోటోలు, 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌లను ఈనెల 22లోపు ఎస్పీ కార్యాలయంలోని పి.ఆర్.ఓ.కు అందజేయాలని కోరారు. జిల్లాలో ఎంపిక చేసిన ఉత్తమ ప్రతిభను రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు.