NRPT: మద్దూరు పట్టణంలో ఆర్‌ఎంపీ వద్ద జ్వరానికి చికిత్స తీసుకున్న మహిళ ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే మృతి చెందింది. నిడ్జింత గ్రామానికి చెందిన ఇటిక్యాల సాయమ్మ (43) జ్వరంతో తాజ్ అనే ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లింది. ఇంజక్షన్ అనంతరం అస్వస్థతకు గురికాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.
తెలంగాణ
ఆర్‌ఎంపీ వైద్యం.. మహిళ మృతి?


