MDCL: కాప్రా బాలాజీకాలనీ, ఆర్కేపురంలోని యామిని కిరాణా షాపులో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. తనిఖీల్లో 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని షాపు యజమాని వై. ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కాప్రా ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ
కిరాణా షాపులో అక్రమ మద్యం.. అరెస్ట్


