హైదరాబాద్: 28°C
తెలంగాణ

11వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, 11వ వార్డులో డ్రైనేజీ పనులను కౌన్సిలర్ రాపర్తి కార్తిక్ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాలనీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కౌన్సిలర్ పేర్కొన్నారు.