SRPT: నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామ ఎస్సీ కాలనీలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాలనీ వాసులు సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వారు ఇవ్వాళా కాలనీలో నూతన బోరును ఏర్పాటు చేయించారు. దీంతో తాగునీటి సమస్య తీరడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యకు పరిష్కారం


