హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం

RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బొంగ్లూర్ ఓఆర్‌ఆర్ నుంచి ఇంజాపూర్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలు, విద్యార్థులతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం అమలుతీరును పరిశీలించారు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో రోజూ లక్ష మందికి పైగా ఉచితంగా ప్రయాణిస్తున్నారని, కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈవీలను తీసుకొస్తున్నామని తెలిపారు.