హైదరాబాద్: 28°C
తెలంగాణ

210 మంది విద్యార్థులు.. రెండు గదులే..!

WNP: వల్లభ్‌నగర్ జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 210 మంది విద్యార్థులకు రెండు తరగతి గదులు మాత్రమే ఉండటంతో కొందరు వరండా, చెట్ల కింద పాఠాలు వినాల్సి వస్తోంది. గేటు, ప్రత్యేక వంటగది లేకపోవడంతో భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.