హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంచల్‌గూడకు రూ.25 కోట్ల నిధులు: ఎమ్మెల్యే

HYD: చంచల్‌గూడ ప్రభుత్వ విద్యా ప్రాంగణంలో పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలకు సమగ్ర ప్రతిపాదనలు త్వరగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి ఆమె ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. మౌలిక వసతులకు సీఎం రూ.25 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు.