NZB: రెంజల్ మండలం వీరన్న గుట్టలో మంగళవారం వడ్డెర ఓబన్న వర్ధంతిని ఆ సంఘం ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాలోని వడ్డెర జాతి ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సంఘం జిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరన్న గుట్ట సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వీరన్న గుట్టలో వడ్డెర ఓబన్న వర్ధంతి


