ASF: ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ అంగన్వాడీ భవనంలో మంగళవారం పిల్లలు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. దీంతో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వారిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంత పిల్లలు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ స్లాబ్ పెచ్చులు ఊడి పడి పలువురికి గాయాలు


