హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలో పంట దిగుబడి రాక ఆత్మహత్య చేసుకున్న రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరామర్శించి, బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, రైతులను కాపాడుకుంటామని తెలిపారు.