హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో ఈ-ఆటోలతో చెత్తసేకరణ పటిష్టం

కర్నూలు నగరంలో ఎలక్ట్రిక్‌ ఆటోలతో ఇంటింటి చెత్తసేకరణ 5.6 శాతం మెరుగుపడిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం తెలిపారు. వెంకటరమణ కాలనీ, జొహరాపురం జీటీఎస్‌ స్టేషన్లను పరిశీలించారు. నగరానికి 91 ఈ-ఆటోలు మంజూరు కాగా 40 వచ్చాయన్నారు. గార్గేయపురంలో రూ.8 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ చేపడుతున్నట్లు తెలిపారు.