NDL: డోన్ పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే


