హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదాము వద్ద పటిష్ట బందోబస్తు

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని ఈవీఎం గోదాము వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు. మంగళవారం ఎన్నికల అధికారులతో కలిసి గోదామును పరిశీలించిన ఆయన పోలీసుల సమన్వయంతో 24 గంటలూ భద్రత, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని చెప్పారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.