SRD: బీజేపీ పిలుపు మేరకు ఎస్‌ఆర్‌ఐ ప్రక్రియలో భాగంగా సిర్గాపూర్ మండలం వంగ్దాల్ గ్రామంలో బీఎల్వోలను మంగళవారం సన్మానించారు. 85వ బూత్ బీఎల్వో సుజాత, 86వ బూత్ బీఎల్వో కాంతమ్మ పండరిలను మండల బీజేపీ అధ్యక్షుడు శంకర్‌పాటిల్, శ్రీధర్, సర్పంచ్ పండరి, హనుమంతు శాలువాలతో సత్కరించారు. ఓటర్ల జాబితా సవరణలో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.
తెలంగాణ
బీఎల్వోలకు బీజేపీ నాయకుల సన్మానం


