BHPL: రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ శివారులో మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు గుర్తించారు. సురేందర్, వీరన్న, సమ్మిరెడ్డిలు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI సుధాకర్ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం: SI


