హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎస్పీని కలిసిన కళ్యాణదుర్గం డీఎస్పీ

ATP: కళ్యాణదుర్గం నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి.దైవ ప్రసాద్ మంగళవారం అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు.