W.G: మంచిలి రైల్వే ట్రాక్ సమీపంలోని రహదారిపై భారీ గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తణుకు, అత్తిలి, మార్టేరు, తాడేపల్లిగూడెం వెళ్లే వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా మారిన రహదారి


