హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్‌ను పరామర్శించిన మాజీ MLA

BHPL: హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ దిలీప్‌ను మంగళవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ MLA వైద్యులను దిలీప్ ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. అనంతరం దిలీప్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.