హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభం

మార్కాపురం కలెక్టరేట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 265 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం వర్చువల్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.