KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామి ఆలయంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వరుణ యాగం నిర్వహించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వాణి, సూపరింటెండెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల కోసం ఈరన్న సన్నిధిలో వరుణ యాగం


