JN: వడ్డిచర్ల మండల పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాల పరిశుభ్రత, ఏకరూప దుస్తులతో విద్యార్థుల హాజరుపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లడి బెంచీల కొరతను గుర్తించారు. 15 బెంచీలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


