హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

VZM: ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శివాలయంలో నిర్వహించిన సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివుడికి ఘటాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.