NGKL: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన మట్టి పరీక్షా కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. పెండింగ్ పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి అవసరమైన పరికరాలు, కాంపౌండ్ వాల్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
తెలంగాణ
రూ.65 లక్షలతో మట్టి పరీక్షా కేంద్రం: కలెక్టర్


