VZM: జామి సచివాలయాన్ని జేసీ సేధు మాధవన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో రికార్డులు పరిశీలించారు. సచివాలయంలో పెండింగ్ సేవలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే, సిబ్బంది తప్పక సమయపాలన పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాన్ని సందర్శించిన జేసీ


