హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ తొలగింపునకు డిమాండ్‌

MDK: సీఈసీని పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులుగౌడ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఇండియా కూటమి, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఓటర్ల జాబితాల్లో పారదర్శకత, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు కొనసాగిస్తామని తెలిపారు.