హైదరాబాద్: 28°C
తెలంగాణ

14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే

NZB: మానాలలో సుమారు రూ.14 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌. భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.