NTR: గ్రామీణ ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 36 లక్షలతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఆరోగ్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామీణ ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట'


