KRNL: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో పెద్దకడబూరు, మంత్రాలయం ఆశా వర్కర్లు MLA బాలనాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించి, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సెలవులు, వైద్య సదుపాయాలు, రూ.10లక్షల బీమా కల్పించాలని CITU నాయకుడు జయరాజు కోరారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా పోస్టులను పెంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా వర్కర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


