సత్యసాయి: 9వ రాష్ట్రీయ పోషణ మాసం, అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమం ఘనంగా జరిగింది. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథితో కలిసి గర్భిణులకు పసుపు, కుంకుమ, చీరలు, గాజులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మూడోసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో ఘనంగా సామూహిక సీమంతాలు


