హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం'

SKLM: మందస మండలం కొత్తపల్లి పాఠశాలలో గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో కదంబ, చెర్రీ, బాదం మొక్కలు నాటారు. గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయుడు కూన వేణుగోపాలరావు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.