W.G: తాడేపల్లిగూడెం మండలం కడియద్ధ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అండర్-16 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఎం.మణికంఠ, జి.సాయితేజ, కె.సాయి చంద్రశేఖర్, నాగదుర్గ, మానసలు నూజివీడులో 10, 11, 12 తేదీల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని హెచ్‌ఎం పి.సుబ్బలక్ష్మి తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటి విజేతలుగా నిలవాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కడియద్ధ విద్యార్థులు


